Musi River Purification Process :ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కి పచ్చని పంటలు, జలచరాలు, చుట్టూ స్వచ్ఛమైన గాలితో కళకళలాడిన మూసీ నది పరివాహాక ప్రాంతాలన్నీ, నేడు మురికి కూపాలుగా మారాయి. అప్పట్లో ఈ నది నీటితో చక్కటి పాడి, పంటలతోపాటు చేపల పెంపకం సమృద్ధిగా జరిగేది. లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగై నాణ్యమైన ఉత్పత్తులు చేతికొచ్చేవి. ఈ పరిస్థితి ప్రస్తుతం తలకిందులైంది. ముఖ్యంగా మూసీ పరివాహక గ్రామాల ప్రజలు కాలుష్య కాటుతో కొట్టుమిట్టాడుతున్నారు.
వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టి, హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహిస్తుందిమూసీ నది (Musi River). ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. మొత్తంగా 267 కిలోమీటర్ల మేర మూసీ ప్రయాణిస్తుంది. హిమాయత్‌సాగర్, గండిపేట నుంచి మొదలుకుని తూర్పు వైపున ఔటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 57.5 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌లో మూసీ ప్రవాహిస్తుంది. ఈ నది పరివాహక ప్రాంతం వెంట 12,000కు పైగా పరిశ్రమలు ఉన్నాయి.
HC CJ on MUSI: 'హుస్సేన్‌సాగర్ దగ్గర ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయా'
రాష్ట్ర పొల్యూషన్ బోర్డు అధ్యయనం ప్రకారం, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుంచి రోజూ మిలియన్ లీటర్ల సాధారణ, పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయి. రెండేళ్ల కిందట దాదాపు 350 మిలియన్ లీటర్లు కలిసే కాలుష్య నీరు, క్రమంగా పెరిగి 1652 మిలియన్ల లీటర్లకు పెరిగింది. ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే నీరు మూసీని ఎక్కువగా కలుషితం చేస్తోంది. ప్రధానంగా మూసీనది హైదరాబాద్‌లోకి ప్రవేశించిన తర్వాత మురుగు నీరు నేరుగా కలిసి నదీ జలాలు కలుషితం అవుతున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో మూసీలో కలిసే 54 ప్రధాన నాలాలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే 94 శాతం మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ప్రవహించే మూసీ నది పొడవునా ఉన్నా, చెరువులు, నీటి వనరులన్నీ కూడా విషరసాయనాలతో పేరుకుపోయి కాలుష్యమయంగా మారాయి.ఈ నీటితో వరి పంట సాగు చేసినా, దానిని ఆహారంగా తీసుకునే పరిస్థితి లేదు. మూసీ సమీప చెరువుల్లోని చేపలు కూడ మృత్యువాత పడుతున్నాయి.
Musi River Cleaning : మూసీ నది కాలుష్యంతో జలజీవాలు దాదాపు అంతరించపోగా, పశుసంపద కూడా క్రమేపీ కనుమరుగవుతోంది. ఈ నీరు తాగిన పశువులు అనారోగ్యాల పాలవుతున్నాయి. దీంతో పశువులను పెంచలేక పాడి రైతులు, దళారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలన్నీ కలుషితమైపోయాయి. ఆ నీటితో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంట పొలాల్లో పనిచేస్తే శరీరం దద్దుర్లు పెట్టడం, చర్మ సంబంధ వ్యాధుల బారినపడం రైతులు, కూలీల్లో నిత్యకృత్య సమస్యగా పరిణమించింది.
musi project canal land occupation: కబ్జా కోరల్లో మూసీ కాలువ.. రాజకీయ, ఆర్థిక పలుకుబడితో ఆక్రమణలు!