తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీనగర్​లో బతుకమ్మ చీరల పంపిణీ - మహిళలకు చీరలను అందజేసిన ఎమ్మెల్యే ముఠాగోపాల్

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ శ్రీకారం చుట్టారు. మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

గాంధీనగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ
గాంధీనగర్​లో బతుకమ్మ చీరల పంపిణీ

By

Published : Oct 9, 2020, 6:38 PM IST

దేశంలో మహిళలకు అత్యంత గౌరవం, గుర్తింపు ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒక్కరే అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని గాంధీనగర్ డివిజన్ టీఆర్టీ కమిటీ హాల్​లో ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ పెద్ద అన్నగా కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముఠా పద్మ నరేశ్, ఎడ్ల భాగ్యలక్ష్మి, హరిబాబు యాదవ్, హేమలత జయరామ్ రెడ్డి, జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఉప కమిషనర్ ఉమా ప్రకాశ్, ముషీరాబాద్, హిమాయత్ నగర్ మండలాల తహసీల్దార్లు జానకి, లలిత, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:నాలెడ్జ్​ అప్​గ్రేడ్​​తో ఉద్యోగ భద్రత: జయేశ్ రంజన్

ABOUT THE AUTHOR

...view details