హైదరాబాద్ ముషీరాబాద్ నియోజవర్గంలో మురుగునరు నిరంతరం జీవనదుల్లా పొంగిపొర్లుతూనే ఉంటుంది. ఆదర్శకాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, రాంగనర్, చేపల మార్కెట్, అడిక్ మెట్ ఏరియా, లక్ష్మాపార్క్, ఎస్.ఆర్.టీ క్వార్టర్స్, రామాలయం వెనక ప్రాంతంలో అయితే ప్రతి రోజూ మురుగు నీరు వరదల రూపంలో పారుతూనే ఉంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాదండోయ్... మూడు కాలాల పాటు మురుగు నీరు పరుగు పెడుతూనే ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... వచ్చి చూసి పోతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతంలో ఎక్కడ వరదలు వచ్చినా.. ముషీరాబాద్ నియోజకవర్గంలోకి వచ్చి చేరిపోతుంటాయి.
నిజాం కాలం నాటి మురుగు కాల్వలు...
ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన మురుగు కాల్వలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి పాడైపోయాయని... బాగుచేయాలని స్థానికులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా... ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు రావడం... వాటికి సంబంధించిన లెక్కలు వేసుకోవడం తర్వాత వదిలేయడం షరామామూలుగా మారిపోయిందని వాపోతున్నారు. ఎప్పుడు అడిగినా కొత్త మురుగు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారే తప్ప వాటిని పూర్తి చేయడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 5 లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. డ్రైనేజీల కారణంగా తాగే నీటితో సహా మొత్తం నీళ్లన్నీ కలుషితమయ్యాయని... ఫలితంగా అనారోగ్యాల పాలవుతున్నామని అంటున్నారు. అడుగు తీసి అడుగు బయట వేయాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు.
నాగమయ్యకుంటలో పడి చాలామంది చనిపోయారు...