ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హరితహారంలో పాల్గొన్నారు. పలు డివిజన్లలోని కార్పొరేటర్లతో కలిసి ఆయన మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు కాపాడాలంటే విద్యార్థులే అని, శ్రద్ధగా చదువుకునే విద్యార్థులకు మొక్కల బాధ్యత అప్పజెప్పితే అంతే శ్రద్ధగా మొక్కలను పెంచి పెద్ద చేసి.. వృక్షాలుగా చేస్తారని ఎమ్మెల్యే అన్నారు. విద్యాపరంగా వస్తున్న మార్పులను విద్యార్థులు గమనించాలని సూచించారు. సాంకేతిక విద్య దిశగా విద్యార్థులు ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వీ.శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ గణపతి దేవస్థానం ఛైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, జీహెచ్ఎంసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్! - ముషీరాబాద్ వార్తలు
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని.. కార్పొరేటర్లతో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులు మొక్కల సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని.. వారైతే శ్రద్ధగా మొక్కలను కాపాడుతారని ఎమ్మెల్యే అన్నారు.
హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్!