హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గాంధీ నగర్, అడిక్మెట్ తదితర డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు.
'పరిసరాల స్వచ్ఛతనే ప్రజలకు శ్రీరామరక్ష' - Musheerabad MLA Mutta Gopal
సమాజంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని పేర్కొన్నారు.
'పరిసరాల స్వచ్ఛతనే ప్రజలకు శ్రీరామరక్ష'
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు ప్రజలు గురికాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల స్వచ్ఛతనే ప్రజలకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముషీరాబాద్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ ఉమా ప్రకాష్, ఏఎమ్హెచ్ఓ హేమలతతోపాటు తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Last Updated : Jun 5, 2020, 1:54 AM IST