సమాజంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్ ఆధ్వర్యంలో పూల కుండీల కింద ఉన్న ప్లేట్లను శుభ్రపరిచారు.
'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి' - MLA Mutta gopal Awareness on Seasonal Diseases
సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తన నివాసంలో పూల కుండీలు, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయిన నీటిని తొలగించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు అంటు వ్యాధుల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడానికి నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రజలు చెత్తాచెదారం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన పేర్కొన్నారు.