సినిమా థియేటర్ సిబ్బందిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. లాక్‌డౌన్ ఉపసంహరించిన థియేటర్లు తెరుచుకోకపోవడం వల్ల అందులో పనిచేసే సిబ్బందికి సహాయం చేయలన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్ దేవి, సుదర్శన్ సినిమా థియేటర్ కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
సినిమా థియేటర్ సిబ్బందిని ఆదుకోవాలి: ఎమ్మెల్యే - ఎమ్మెల్యే ముఠా గోపాల్ తాజా వార్తలు
లాక్‌డౌన్ ఉపసంహరించిన సినిమా థియేటర్‌లు తెరచుకోకపోవడం వల్ల అందులో పనిచేసే సిబ్బందిని దాతలు ఆదుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని దేవి, సుదర్శన్ సినిమా థియేటర్ సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
సినిమా థియేటర్ సిబ్బందిని ఆదుకోవాలి: ఎమ్మెల్యే
లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ముఠా నరేశ్, ముఠా జైసింహ, శ్రీకాంత్, జగదీశ్, దేవి థియేటర్, సుదర్శన్ థియేటర్ యజమానులు, మేనేజర్‌లు పాల్గొన్నారు.