తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్​ - ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి శాసనసభ్యులు ముఠా గోపాల్​ పరిశీలించారు. అభివృద్ధి పనులను ఎలాంటి అవకతవకలు లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

musheerabad mla muta gopal visited development works
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్​

By

Published : May 18, 2020, 10:51 PM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు. హైదరాబాద్ కవాడిగూడలో రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి శాసనసభ్యులు ముఠా గోపాల్ సందర్శించారు. ఆయనతోపాటు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీలక్ష్మి, డీఈ సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ, తదితరులు పనులను పరిశీలించారు.

అభివృద్ధి పనులు ఎలాంటి అవకతవకలు లేకుండా చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ అమలు తీరుపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details