వర్షాకాలం నేపథ్యంలో ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అశోక్ నగర్లో గల గోకుల్ అపార్ట్మెంట్లో పూల కుండీల కింద ఉన్న ప్లేట్లలో నీళ్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచనలు చేశారు. లేని పక్షంలో దోమల బెడద పెరిగి అంటువ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదని ఆయన తెలిపారు.
ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్ - ghmc
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఓ అపార్ట్మెంట్లోని పూలకుండీల కింద ఉన్న ప్లేట్లను శుభ్రపరిచారు. ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రధానంగా డెంగ్యూ తదితర వ్యాధుల పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటించాలని అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ముఠా నరేష్, ముఠా జైసింహ, శ్రీకాంత్, పద్మ, సూర్య ప్రకాష్, వేణుగోపాల్, ముచ్చకుర్తి ప్రభాకర్, దశరథ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా టీకా ఈ ఏడాది సాధ్యం కాదు: సీసీఎంబీ డైరెక్టర్