లాక్డౌన్ సమయంలో పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని శాసనసభ్యులు ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆశా వర్కర్లకు, ఆస్పత్రిలో పనిచేసే ఆయాలకు,పేదలకు కొందరు దాతల సహకారంతో 150 మందికి నిత్యావసర సరకులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ చేశారు.
ఆశా వర్కర్లకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - సరకులు పంపిణీ చేసిన ముఠాగోపాల్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆశా వర్కర్లకు, ఆస్పత్రిలో పని చేసే ఆయాలకు, కొందరు నిరుపేదలకు ఎమ్మెల్యే ముఠాగోపాల్ సరకులు అందజేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
ఆశా వర్కర్లకు సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను దినచర్యలో భాగంగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం