కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొనియాడారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో శానిటేషన్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. గాంధీనగర్ అడిక్మెట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పీపీఈ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
800 మంది పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ - sanitation staff
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న కృషిని ఎమ్మెల్యే కొనియాడారు. శానిటేషన్ సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వివరించారు.
musheerabad mla muta gopal distributed ppe kits to sanitation Staff
శానిటేషన్ సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వివరించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రభుత్వం అందిస్తోన్న సహకారం సద్వినియోగం చేసుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పని చేస్తోన్న 800 మంది శానిటేషన్ సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేశారు.