హైదరాబాద్ ముషీరాబాద్‌లోని భవిత పాఠశాల ఆవరణలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసరాలు అందజేశారు. కరోనా వంటి ఆపత్కాలంలో.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి' - Hyderabad news
ప్రజల్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సొసైటీ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్‌లో దివ్యాంగులు, వికలాంగుల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.
ముషీరాాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ప్రస్తుత పరిస్థితుల్లో వికలాంగులు, దివ్యాంగులను స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రభుత్వం సమకూర్చిన పలు సంక్షేమ పథకాలు వారికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.