తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి' - అనాధ పిల్లలకు పండ్ల పంపిణీ

సమాజంలోని అనాథలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠాగోపాల్​ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనాథలకు పండ్లను పంపిణీ చేశారు.

Musheerabad Mla Muta gopal distributed fruits for Orphans
స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

By

Published : Jun 2, 2020, 6:33 PM IST

సమాజంలోని అభాగ్యులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిదాయూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ అనాథాశ్రమంలోని విద్యార్థినిలకు పండ్లను పంపిణీ చేశారు.

బాలికలు మంచిగా చదువుకొని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఆశ్రమంలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొని రావాలని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని మరింత విస్తృత పరచాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details