ప్రజలు పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచనలు చేశారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రాంనగర్ డివిజన్లోని రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రపరిచారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించని పక్షంలో ఉత్పన్నమయ్యే దోమల వల్ల ఏర్పడే డెంగ్యూ వ్యాధితొ పాటు వివిధ అంటువ్యాధులు సోకే అవకాశాలు ఉన్నందువల్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు.
చెత్తను తొలగించిన ఎమ్మెల్యే ముఠాగోపాల్ - corona virus
అపరిశుభ్రత పెరిగితే దోమలు విస్తరించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ప్రజలు పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. హైదరాబాద్ రాంనగర్ డివిజన్లోని రీసాలగడ్డలో 'ప్రతి ఆదివారం 10నిమిషాల' పాటు కార్యక్రమంలో పాల్గొని పేరుకు పోయిన చెత్తను ఎమ్మెల్యే తొలగించారు.
పేరుకుపోయిన చెత్తను తొలగించిన ఎమ్మెల్యే
కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని.. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వి. శ్రీనివాస రెడ్డి, తెరాస పార్టీ నాయకులు మోజెస్, ఎర్రం శేఖర్, ముదిగొండ మురళి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనాపై ఆందోళన అవసరం లేదు.. అన్నీ సిద్ధంగా ఉన్నాయి: కేసీఆర్