ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో పాటు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులతో కలసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
బడుగు, బలహీన వర్గాలకు సీఎం అండగా నిలిచి ఏ రాష్ట్రంలో లేని ఎన్నో సంక్షేమ పథకాలని తెలంగాణలో అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హౌసింగ్ బోర్డు అద్దె షాపుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం, కేటీఆర్‌తో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు.