కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్‌కు అందిస్తున్న రుణ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. స్ట్రీట్ వెండర్స్‌కు ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రత్యేక మైక్రో క్రెడిట్ పథకాన్ని హైదరాబాద్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఎమ్మెల్యే ప్రారంభించారు.
'రుణ సాయాన్ని స్ట్రీట్ వెండర్స్ సద్వినియోగం చేసుకోవాలి' - musheerabad mla latest news
స్ట్రీట్ వెండర్స్‌కు కేంద్ర ప్రభుత్వం అందిస్తునన రుణ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రత్యేక మైక్రో క్రెడిట్ పథకాన్ని హైదరాబాద్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఎమ్మెల్యే ప్రారంభించారు.
వీధుల్లో రోడ్లకు ఇరువైపులా గుర్తింపు కార్డు కలిగిన తోపుడు బండ్లు, స్థిరంగా వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్స్ లబ్ధిదారులు నిర్మాణాత్మక ప్రణాళికతో రుణ మొత్తాన్ని వినియోగించుకొని తమ వ్యాపారాలను మరింత పురోభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్లాలని ముఠా గోపాల్ తెలిపారు. అదేవిధంగా ఆర్థికంగా ఎదగాలన్నారు. ప్రధానంగా కొవిడ్ 19 వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని స్ట్రీట్ వెండర్స్ తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాపారం నిర్వహించాలని సూచించారు.
ఇది చదవండి:పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ