పవిత్ర రంజాన్లో ముస్లింలు భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రార్థనలు నిర్వహించాలని హైదరాబాద్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. కొవిడ్-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉండగల్గుతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
'కరోనా కట్టడికి భౌతిక దూరమే ప్రధాన ఆయుధం' - ramzan festival in telangana
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పార్శిగుట్టలో ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముస్లింలకు బిర్యానీ బాక్సులు అందించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ... ప్రార్థనలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.
'భౌతిక దూరమే ప్రధాన ఆయుధం'
రంజాన్ పురస్కరించుకొని ముస్లింలకు ముషీరాబాద్ తెరాస నాయకుడు సోమన్న ప్రత్యేకంగా చికెన్ బిర్యాని తయారు చేయించారు. పార్సిగుట్టలో ముస్లింలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.