తెరాస అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న నాగభూషణం గౌడ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని వైయస్సార్ పార్క్, ప్రేయర్ పవర్ చర్చి ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఆ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు: స్వప్న నాగభూషణం - musheerabad congress candidate
ముషీరాబాద్ డివిజన్లో ప్రజాసమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న నాగభూషణం విమర్శించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.. ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు: స్వప్న నాగభూషణం
చేతి గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఒక్కసారి అవకాశమివ్వాలని కోరారు. ప్రస్తుత కార్పొరేటర్ ఏ రోజు అందుబాటులో లేరని విమర్శించారు. ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని మండిపడ్డారు.