ముషీరాబాద్ నియోజకవర్గ భాజపా శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ బారిన పడిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు. లక్ష్మణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు.
ముషీరాబాద్‌లోని ఉప్పాలమ్మ ఆలయంలో స్థానిక కార్పొరేటర్ ఎం. సుప్రియ నవీన్ గౌడ్ పూజలు నిర్వహించారు. బాకారంలోని 200 ఏళ్లనాటి పురాతన అమ్మవారి దేవాలయంలో రామ్‌నగర్ కార్పొరేటర్ రవిచారి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నేత త్వరగా కోలుకుంటే అదే ఆలయంలో వెయ్యి కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నారు. అలాగే ఆడిక్మెట్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోను భాజపా శ్రేణులు పూజలు నిర్వహించారు.