ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోప్‌ను ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు. మ్యూస్కోప్‌గా పిలుస్తున్న దీని నమూనాను వీరు అభివృద్ధి చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ శిశిర్‌కుమార్ తన పరిశోధక విద్యార్థులు ఏక్తా ప్రజాతి, సౌరవ్‌కుమార్‌ల సహకారంతో దీన్ని రూపొందించారు. ‘‘ప్రస్తుతం ఉపయోగిస్తున్న మైక్రోస్కోప్‌లతో పోల్చితే ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. ఖర్చు తగ్గడంతోపాటు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చని’’ పరిశోధకులు తెలిపారు.
మ్యూస్కోప్... ఇది అతి చిన్న మైక్రోస్కోప్!
ప్రపంచంలోనే అతిచిన్న మైక్రోస్కోప్ నమూనాను ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు. అతి చిన్న పరిమాణంలో ఇండే ఈ మ్యూస్కోప్ వల్ల ఖర్చు తగ్గడంతోపాటు.. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ సాంకేతికతను వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చే అంశమై దృష్టి సారించామని ఐఐటీ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి అన్నారు. ‘‘మ్యూస్కోప్‌లో తొలిసారిగా మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఇమేజ్ సెన్సర్లు, మైక్రోప్లుయిడిక్ చిప్స్‌ను ఉపయోగించాం. బయోమార్కర్స్, మినీయేచర్ అనాలసిస్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్ వర్క్‌ఫ్లోలను వినియోగిస్తూ ఈ సాంకేతికతను వ్యాధి నిర్ధారణ కోసం వాడేలా కసరత్తు చేస్తున్నాం. పర్యావరణంలో మార్పులను పరిశీలించేందుకు, వ్యవసాయ, పశుసంవర్ధక రంగాల్లో ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి’ అని డాక్టర్ శిశిర్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి:Double Bedroom houses: "పట్టణాల్లో వడివడిగా.. పల్లెల్లో నెమ్మదిగా"