హైదరాబాద్ పాతబస్తీ టెక్రి ప్రాంతంలో ఈ నెల 26అర్ధరాత్రి జరిగిన అబ్దుల్ రవుఫ్ హత్య కేసును టాస్క్‌ఫోర్స్ సాయంతో కాలాపత్తర్ పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ముంతాజ్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
ముంతాజ్ వదినను.. తన సోదరుడి మరణాంతరం రవుఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత వారి పాత ఇంటి ముందే జీవనం సాగిస్తున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న ముంతాజ్.. కుళాయి మరమ్మతులు చేసే పానతో రవుఫ్ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ రవుఫ్ ఆస్పత్రికి తరలించే సమయంలో మృతి చెందాడు.