తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో సాగర్ అనే వ్యక్తిపై ప్రవీణ్ అనే అతను కత్తితో దాడి చేసిన ఘటన నగరంలోని చిక్కడపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాగర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
' వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం' - Murder At Chikkadapalli For Illegal Affair
హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంతో సాగర్ అనే వ్యక్తిపై ప్రవీణ్ అనే అతను కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన సాగర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మృతి చెందాడు.

Chikkadpalli_Murder
అర్టీసీ క్రాస్‌రోడ్ లోని ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా ప్రవీణ్ పనిచేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పనిచేసే చోట తోటివాడైన సాగర్... ప్రవీణ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సాగర్‌ది కర్ణాటకలోని గుల్బర్గా అని... అతని కుటుంబం కొద్ది నెలల క్రితమే హైదరాబాద్‌కు వలస వచ్చిందని చెప్పారు.
అక్రమసంబంధం నెపంతో ఒకరిపై కత్తితోదాడి... వ్యక్తి మృతి
ఇదీ చూడండి:చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ