తెలంగాణ

telangana

ETV Bharat / state

కేపీహెచ్​బీలో కర్రలతో కొట్టి చంపారు - హత్య

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని కళామందిర్​ రహదారిలో హత్య జరిగింది. సెంట్రింగ్​కు వినియోగించే కర్రలతో కొట్టి దారుణంగా హతమార్చారు.

కేపీహెచ్​బీలో కర్రలతో కొట్టి చంపారు

By

Published : Jul 4, 2019, 10:00 PM IST

కేపీహెచ్​బీలో కర్రలతో కొట్టి చంపారు

హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. కళామందిర్​ రోడ్డులోని ఓ ఖాళీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సుమారు 30 సంవత్సరాలున్న ఓ వ్యక్తిని సెంట్రింగ్​ కోసం వినియోగించే కర్రలతో కొట్టి కిరాతకంగా హతమార్చారు. ఓ గదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని మాదాపూర్​ డీసీపీ వెంకటేశ్వరరావు, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డాగ్​ స్క్వాడ్​తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details