తెలంగాణ

telangana

ETV Bharat / state

యువకుడిపై హత్యాయత్నం.. నిందితులు పరారీ! - కేపీహెచ్​బీ కాలనీ

యువతి  పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో ముగ్గురు యువకులు కలిసి సమీర్​ అనే యువకుడిని హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన కేపీహెచ్​బీ కాలనీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు చూసి.. కేకలు వేయగా.. నిందితులు సమీర్​ను అక్కడే వదిలేసి పరారయ్యారు.

Murder Attempt On Young Man In KPHB Colony
యువకుడిపై హత్యాయత్నం.. నిందితులు పరారీ!

By

Published : Aug 15, 2020, 8:49 PM IST

హైదరాబాద్ కేపీహెచ్​బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు కలిసి ఓ యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేబీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సాయినగర్ కాలనీ వద్ద సమీర్ అనే యువకుడి మీద ముగ్గురు యువకులు హత్యాయత్నం చేశారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గానూ.. ఎన్టీఆర్​నగర్ కాలనీకి చెందిన సోహెల్, ఆసిఫ్, అస్లాం అనే ముగ్గురు యువకులు సమీర్​పై దాడి చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

సమీర్​ను అతని ఇంటి నుంచి తీసుకువచ్చి ఆటోలో ఎక్కించుకొని కత్తులతో పొడిచి చంపేందుకు ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి ఆటోలో గొడవ జరుగుతుండగా స్థానికులు చూసి కేకలు వేయగా.. నిందితులు సమీర్​ను ఆటోలోంచి తోసేసి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమీర్​ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ABOUT THE AUTHOR

...view details