హైదరాబాద్ లంగర్ హౌజ్‌లో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో మానవత్వం మరిచి కట్టుకున్న భార్యనే సిలిండర్‌తో మోది ఆమె గొంతు నులిమి హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. నిన్న రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగటంతో... కోపంతో ఉన్న భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు.
భార్య పాలిట భర్తే కాలయముడయ్యాడు.. - Murder at Langer house in Hyderabad
కడదాకా తోడు ఉంటానని బాస చేసిన భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. జీవితాంతం రక్షగా ఉండాల్సిన వాడే సిలిండర్‌తో మోది ఆమెను హత్య చేశాడు.
భార్య పాలిట భర్తే కాలయముడయ్యాడు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.