రెండురోజుల క్రితం వరంగల్ నగరంలో తెరాస సర్కారు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని భాజపా చేపట్టింది. చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టడంలో సర్కారు విఫలమవుతోందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మండుతున్న పెట్రోల్ మీదపడి కార్యకర్త బింగి శ్రీనివాసరావు గాయపడ్డారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలోకు తరలించారు. బింగి శ్రీనివాసరావును పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఇవాళ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దిష్టిబొమ్మ దహనంలో గాయపడిన వ్యక్తికి పరామర్శ - MURALIDHARRAO VISIT TO INJURED PERSON
వరంగల్ నగరంలో దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమయంలో మంటలు అంటుకుని గాయపడిన భాజపా కార్యకర్త బింగి శ్రీనివాసరావును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు ఇవాళ పరామర్శించారు.
దిష్టిబొమ్మ దహనంలో గాయపడిన వ్యక్తికి మురళీధరరావు పరామర్శ
TAGGED:
MURALIDHARRAO