Garbage tax: ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కేంద్రంలోని పూల్ బాగ్ అయ్యప్పనగర్లో సాయిఅమృత రెసిడెన్సీ వాసులు చెత్త పన్ను కట్టడం లేదని మున్సిపల్ సిబ్బంది, స్థానిక వైకాపా నాయకులు చెత్తను అపార్ట్మెంట్ ముందు వేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు దాడికి పాల్పడ్డారని అపార్ట్మెంట్ నివాసి రవి ఆరోపించారు. తమపై దాడి చేసిన నాయకులు, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని.. అపార్ట్మెంట్ వాసులు నిరసన చేపట్టారు. చెత్తపన్ను రద్దు చేయాలని అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. చెత్తపన్ను కట్టకపోతే ఇలా దాడులు చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
చెత్త పన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది ఏం చేశారంటే - wastage at apartment
Garbage at Apartment చెత్త పన్ను కట్టకపోతే ఫైన్ వేస్తారు. లేదంటే ఆ ఇంట్లో చెత్త తీసుకెళ్లడం మానేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో మున్సిపల్ సిబ్బంది ఏం చేశారో తెలుసా. ఓ అపార్ట్మెంట్ వాళ్లు చెత్త పన్ను కట్టలేదని ఎక్కడి చెత్తో తీసుకొచ్చి అపార్ట్మెంట్ ముందు పడేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు స్థానికి వైకాపా నేతలు రెచ్చిపోయి అపార్ట్మెంట్ వారిపై దాడికి దిగారు. వైకాపా నేతన తీరును నిరసిస్తూ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేపట్టారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
garbage before apartment