తెలంగాణ

telangana

ETV Bharat / state

'వచ్చేనెల మొదటి వారంలో పురపోరుకు నోటిఫికేషన్...!' - అధికారులతో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష

ఈ నెల 31న హైకోర్టు తీర్పు తర్వాత ఎప్పుడైనా పురపోరుకు సిద్ధపడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ నాగిరెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

అధికారులతో ఎన్నికల కమిషన్ దృశ్యమాధ్యమ సమీక్ష

By

Published : Oct 29, 2019, 7:21 PM IST

Updated : Oct 29, 2019, 8:01 PM IST

కలెక్టర్లు, పురపాలక కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది. పురపాలక ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతను గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమీక్షించారు. ఈనెల 31న హైకోర్టు తీర్పు తర్వాత ఎప్పుడైనా పురపోరుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.

హుజూర్​నగర్​లో ఎడమచేయి మధ్యవేలికి సిరా చుక్కా

ఇప్పటికే శిక్షణ పూర్త్తిచేసుకొని బదిలీ అయిన, మరణించిన ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించారు. 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలోఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మీర్​పేట కార్పొరేషన్​లో వార్డుల విభజన ఇంకా పూర్తికాలేదు. హుజూర్​నగర్​పురపోరులో ఓటరు ఎడమచేయి మధ్యవేలికి సిరా చుక్కా వేయాలని కమిషన్ నిర్ణయించింది.

నవంబర్ మొదటివారంలో నోటిఫికేషన్..!

800 మందికి ఒక పోలింగ్​ కేంద్రం చొప్పున 8,056 కేంద్రాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండిః పురపోరుకు వేళాయే... వచ్చేనెల మూడోవారంలో ఎన్నికలు!

Last Updated : Oct 29, 2019, 8:01 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details