స్వీయ ధ్రువీకరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు తీసుకువచ్చిన టీఎస్- బీపాస్‌లో భాగంగా రాష్ట్రంలో జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పకడ్బందీ చర్యలు
ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపకదళం, రహదారులు, భవనాలశాఖ అధికారులు ఉండాలని అర్వింద్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భవనాలను కూల్చివేయడానికి అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌లు నిర్దేశించిన సమయంలో తనిఖీలు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతులు తీసుకోవడం లేదా ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. పోర్టల్, కాల్ సెంటర్లు, మొబైల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై మూడు రోజుల్లో పరిశీలించి అక్రమమని తేలితే ఎలాంటి నోటీసు లేకుండానే కూల్చివేయాలని స్పష్టం చేశారు.
యజమానులే చెల్లించాలి