ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పన్ను, పన్నేతర ఆదాయం వసూళ్లు వందశాతం వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశించింది. మార్చి 31 వరకు నూరుశాతం వసూళ్లు ఉండేలా పనిచేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే వరకు పన్ను, పన్నేతర ఆదాయం వందశాతం వసూలు కావల్సిందేనని... అందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేసింది.
'మార్చి వరకు వందశాతం పన్నులు వసూలు కావాలి' - మున్సిపల్ పన్నులు
ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు పన్ను, పన్నేతర ఆదాయం వందశాతం వసూలే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. వసూళ్లలో ఎవరైనా అలక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
'మార్చి వరకు వందశాతం పన్నులు వసూలు కావాలి'
ప్రతి సోమ, బుధ, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లోనూ విధిగా పన్ను వసూలు మేళాలు నిర్వహించాలని సూచించింది. అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. వసూళ్లలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి:ఆదాయ, వ్యయాలపై త్వరలో పైలట్ సర్వే: ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డీజీ