తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయనగర రాజుల కాలం నాటి కట్టడం కూల్చివేత

విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం, మూడు లాంతర్ల స్తంభాన్ని నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. ఈ స్తంభంపై కొలువైన మూడు జాతీయ చిహ్నాలు ఉంటాయి. విజయనగర రాజుల కాలం నాటి కట్టడాన్ని కూల్చివేయడంపై స్థానికులు.. మండిపడుతున్నారు.

municipal-corporation-officials-demolished-three-lanterns-pillars-in-vizianagaram
విజయనగర రాజుల కాలం నాటి కట్టడం కూల్చివేత

By

Published : May 23, 2020, 9:49 AM IST

ఏపీ విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం, మూడు లాంతర్ల స్తంభాన్ని నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. మూడు ప్రధాన రహదారులు కలిసేచోట నిర్మించిన హరికేన్ లాంతర్ల స్తంభం. ఈ స్తంభంపై మూడు జాతీయ చిహ్నాలు కొలువై ఉంటాయి. ఈ స్తంభాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించారని పూర్వీకులు చెప్పుకుంటారు. రాత్రి సమయంలో ప్రయాణికులకు దారి కనిపించేందుకు రాజుల కాలంలో మూడు లాంతర్ల స్తంభాన్ని నిర్మించారు. మూడు లాంతర్ల స్తంభం కారణంగా మూడు లాంతర్ల జంక్షన్​గా ప్రసిద్ధి చెందింది. కూల్చివేసిన స్థానంలో అదే స్థలంలో మరో రూపాన్నిచ్చి మూడు లాంతర్ల కొత్త చిహ్నాన్ని నిర్మించేందుకు అధికారుల ఆలోచిస్తున్నారని సమాచారం. ఇది ఇలా ఉండగా, విజయనగర రాజుల కాలం నాటి కట్టడాన్ని కూల్చివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయనగర రాజుల కాలం నాటి కట్టడం కూల్చివేత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details