తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆహ్లాదరకమైన వాతవరణం కల్పించాలనే ఉద్దేశంతోనే' - హైదరాబాద్ తాజా వార్తలు

కేబీఆర్‌ పార్క్‌కు వచ్చేవారికి ఒక ఆహ్లాదరకమైన వాతవరణం కల్పించాలనే ఉద్దేశంతోనే పార్క్​ను అందంగా రూపొందిస్తున్నట్లు... చిచాస్​ సంస్థ నిర్వాహకులు తెలిపారు. పార్క్‌ గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన లవ్‌ హైదరాబాద్‌ సింబల్‌ను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ప్రారంభించారు.

Municipal Corporation Chief Secretary Arvind Kumar inaugurated the Love Hyderabad symbol at KBR Park
కేబీఆర్ పార్క్​లో లవ్​ హైదరాబాద్​ సింబల్​ను ప్రారంభం

By

Published : Apr 15, 2021, 3:58 AM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన లవ్‌ హైదరాబాద్‌ సింబల్‌ను... పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సింబల్​ను రూపొందించినట్లు చిచాస్‌ సంస్థ నిర్వాహకులు కుతుబ్‌ అలం ఖాన్‌ తెలిపారు. ప్రతి రోజు ఎంతో మంది పార్క్​కు వస్తుంటారని ఆయన అన్నారు.

వారికి ఒక ఆహ్లాదరకమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అందంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. మూడో పార్క్‌ స్థలాన్ని పూర్తిగా సుందరీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సామాజిక బాధ్యతగా తాము చేసిన ఈ సింబల్‌ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సహాకారం అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్-హౌరాల మధ్య ప్రత్యేక రైళ్లు

ABOUT THE AUTHOR

...view details