Municipal Chief Secretary Review Meeting on Prajapalana : ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్డు సభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పురపాలక శాఖ సంచాలకులు హరిచందన, అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. ప్రజాపాలన సన్నద్ధతపై సమీక్షించారు. ఓఆర్ఆర్ పరిధిలోని కమిషనర్లు ప్రత్యక్షంగా, మిగిలిన వారు జూమ్‌లో సమావేశానికి హాజరయ్యారు.
Dana kishore Meeting with Officers: వార్డు సభలకు ఏర్పాటు చేసి, బృందాలను పూర్తి చేయాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, వాటికి రసీదు ఇవ్వడం, కంప్యూటరీకరణ చేయడం తదితర అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డు సభల తేదీలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. కార్యక్రమంపై రోజు వారీ నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
మరో కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం - ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన'
Praja Palana Fund Released by CM: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy Meeting with Collectors) జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా గ్రామాల్లోకి వెళ్లి వినతులు స్వీకరించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం కోసం రూ.25 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ నిధులతో సభల్లో మంచి నీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.