తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్సేన్ సాగర్​లో చెత్త సేకరణకు యంత్రం - చెత్త సేకరణ యంత్రం తాజా వార్తలు

హుస్సేన్ సాగర్​లోకి వచ్చే చెత్తను సేకరించే యంత్రాన్ని తీసుకొచ్చినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. మనుషుల సహాయం లేకుండానే చెత్త సేకరిస్తుందని తెలిపారు. మరో ఆరు యంత్రాలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

Machine for garbage collection in Hussain Sagar
హుస్సేన్ సాగర్​లో చెత్త సేకరణకు యంత్రం

By

Published : Jan 22, 2021, 10:07 AM IST

హుస్సేన్ సాగర్​లోని చెత్తను సేకరించే యంత్రాన్ని తీసుకొచ్చినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్​లో వెల్లడించారు. మనుషుల సహాయం లేకుండానే చెత్త సేకరిస్తుందని తెలిపారు.

యంత్రాన్ని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చి పరిశీలిస్తున్నామని చెప్పారు. హెచ్ఎండీఏ డబ్ల్యూఆర్ఐ, దేశ్మీలతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యంత్రం మూడు రోజుల్లో ఒక టన్ను చెత్తను సేకరిస్తుందని తెలిపారు.

గ్లాస్, ఆల్కహాల్, వాటర్ బాటిల్స్, విరిగిపోయిన ప్లాస్టిక్ పదార్థాలు, మగ్​లు, బకెట్లు, బొమ్మలు, బాక్స్​లు, ఆటో మొబైల్ పరికరాలు, చాక్లెట్ రేపర్లు, చిప్స్, బిస్కట్, నమ్​కిన్, పాన్​మసాల పాకెట్స్ తొలగిస్తుందని పేర్కొన్నారు.

రబ్బర్, లెదర్, బూట్లు, చెప్పులు, పాల కవర్లు, సాక్స్​లు, షాపింగ్ బ్యాగులు, థర్మాకోల్​ లాంటి మరెన్నో.. ఈ యంత్రం సేకరిస్తుందని తెలిపారు. ఇటువంటి మరో ఆరు అందుబాటులోకి తీసుకొస్తామని అరవింద్ కుమార్ వెల్లడించారు.

ఇదీ చూడండి:ఇకపై అలా కుదరదు... ఓఆర్‌ఆర్‌పై 1200 సీసీ కెమెరాలు

ABOUT THE AUTHOR

...view details