నగరపాలక సంస్థల పాలకమండళ్లకు మేయర్లు, పురపాలక సంస్థల పాలకమండళ్లకు ఛైర్‌పర్సన్లు నేతృత్వం వహిస్తారు. పాలకమండళ్ల సమావేశాలకు అధ్యక్ష్యత వహించనున్న మేయర్లు, ఛైర్ పర్సన్లు పురపాలనను సాఫీగా సాగించాల్సి ఉంటుంది. మేయర్లు, ఛైర్‌పర్సన్ల కర్తవ్యాలు, బాధ్యతలను పురపాలక చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చట్టంలో 23వ విభాగం ప్రకారం.. ప్రతి నెల ఒకసారి పాలకమండలిని సమావేశపరచాలి. కౌన్సిల్ సభ్యులంతా.. లేదా సగం మంది సభ్యులు లిఖితపూర్వకంగా కోరినప్పుడు పాలకమండలి భేటీ కావాలి. పట్టణంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరాతో పాటు వీధి దీపాలు సరిగా నిర్వహించాలి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన మేరకు పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి. పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను పరిరక్షించాలి.