Salaries Deduction: టీఎస్‌బీపాస్ చట్టం ప్రకారం భవన నిర్మాణ దరఖాస్తుల పరిష్కారంలో అలక్ష్యం వహించిన ఐదుగురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. నిర్ధేశిత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించనందుకు ఐదుగురు సైట్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ వేతనాల్లో పురపాలకశాఖ కోత విధించింది. చట్టంలో నిర్ధేశించిన గడువులోపు పరిష్కరించనందుకు ఈ నిర్ణయం తీసుకొంది.
భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం.. 5గురు అధికారుల వేతనంలో కోత - ts news
Salaries Deduction: భవన నిర్మాణ అనుమతుల జారీలో ఉదాసీనంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి నెల వేతనంలో ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున కోత విధిస్తూ రాష్ట్ర పురపాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నర్సాపూర్ మున్సిపాలిటీకి చెందిన మణిభూషణ్, కామారెడ్డిలో పనిచేసే యశ్వంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో బాధ్యతల్లో ఉన్న యాదయ్య, ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగి సురేష్, మక్తల్ వెరిఫికేషన్ ఆఫీసర్ షహరాజ్ అహ్మద్ వేతనాల్లో ఐదు వేల రూపాయలు కోత విధించారు. సదరు ఉద్యోగుల ఫిబ్రవరి వేతనాల్లో ఐదు వేల రూపాయల చొప్పున కోత విధించాలని... మార్చి ఐదో తేదీ వరకు అందుకు సంబంధించిన వివరాలు పంపాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ మేరకు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: