తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపోరుకు కసరత్తు వేగవంతం

పురపాలక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్​సైట్ tsec.gov.in లో పొందుపర్చారు.

కసరత్తు వేగవంతం

By

Published : Jul 17, 2019, 5:55 AM IST

Updated : Jul 17, 2019, 7:29 AM IST

పురపోరుకు కసరత్తు వేగవంతమవుతోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లతో సహా 127 మున్సిపాలిటీల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా ప్రకటించారు. ఈనెల పదో తేదీన వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదా వెల్లడించి అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని పరిష్కరించి వార్డుల వారీ ఫొటో ఓటర్ల తుదిజాబితా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు కూడా వెలువరించడం వల్ల రిజర్వేషన్ల ఖరారుకు మార్గం సుగమమైంది.

కొత్త పురపాలక చట్టంలో పొందుపర్చే ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. వార్డుల వారీ రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో, ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేస్తారు. ఆ వివరాలు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈ నెల 21న ప్రకటించనున్నారు. వార్డుల వారీ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్​సైట్ tsec.gov.in లో పొందుపర్చారు.

కసరత్తు వేగవంతం

ఇవీ చూడండి: తెలుగు ఎంపీలను సత్కరించిన దిల్లీ తెలుగు అకాడమీ

Last Updated : Jul 17, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details