తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వైరస్​పై పాతబస్తీ పోలీసుల వినూత్న కార్యక్రమం - MUGHALPURA POLICE AWARENESS IN OLD CITY HYDERABAD

కరోనా వైరస్​పై హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు వినూత్న పద్ధతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ర్యాలీగా తరలివెళ్తూ కరోనాపై పాటలు పాడుతున్నారు. ఈ మేరకు భౌతిక దూరం పాటిస్తూనే అవగాహన కల్పిస్తున్నారు.

కరోనాపై వినూత్న రీతిలో పోలీసుల ప్రచారం
కరోనాపై వినూత్న రీతిలో పోలీసుల ప్రచారం

By

Published : Apr 12, 2020, 12:25 PM IST

కరోనా వైరస్​ నిర్మూలనకు హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్​పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. కరోనా వైరస్​పై అప్రమత్తంగా ఉండాలంటూ మొఘల్​పురా పోలీస్ స్టేషన్ పరిధిలో పాటల రూపంలో వివరించారు.వైరస్ సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.

ఠాణా పరిధిలోని వీధులన్నీ తిరుగుతూ అవగాహన కల్పించారు. ప్రజలు కూడా వీరి సూచనలు పాటిస్తూ ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు. ప్రతి నిత్యం ప్రజా శ్రేయస్సు కోసమే కష్టపడుతున్న తమ శ్రమను గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు పోలీస్ శాఖ ఇస్తోన్న సూచనలు పాటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.

ఇవీ చూడండి : కరోనా విజృంభణ: 503కు చేరిన కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details