తెలంగాణ

telangana

ETV Bharat / state

విమర్శలు భరించలేక.. కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: ముద్రగడ - ముద్రగడ పద్మనాభం తాజా వార్తలు

కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ మేరకు కాపు సోదరులకు లేఖ రాశారు. తనపై వస్తోన్న లేనిపోని ఆరోపణలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

mudragada
విమర్శలు భరించలేక.. కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: ముద్రగడ

By

Published : Jul 13, 2020, 12:52 PM IST

ఏపీ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాపు సోదరులకు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తనపై దాడులు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈ ఉద్యమం ద్వారా డబ్బు, పదవులు పొందాలనుకోలేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని.. అందుకు ఏనాడూ చింతించలేదని చెప్పారు. అయినా కూడా కొందరు స్వార్థపరులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

విమర్శలు భరించలేక.. కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: ముద్రగడ
విమర్శలు భరించలేక.. కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నా: ముద్రగడ

ఇదీ చూడండి:బంగాల్​ భాజపా ఎమ్మెల్యే ఆత్మహత్య?

ABOUT THE AUTHOR

...view details