తెలంగాణ

telangana

ETV Bharat / state

'గంగపుత్ర, ముదిరాజు మధ్య చిచ్చు పెట్టడం సరికాదు' - Gangaputra Association state president A.L. Mallya demanded.

చెరువులపై ముదిరాజ్​లకు హక్కు ఉందంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలని ఆ సంఘం డిమాండ్ చేసింది.

Mudirajs have Gangaputra rights over ponds, says Gangaputra Association state president A.L. Mallya demanded.
'గంగపుత్ర, ముదిరాజు మధ్య చిచ్చు పెట్టడం సరికాదు'

By

Published : Jan 13, 2021, 3:51 PM IST

Updated : Jan 14, 2021, 11:09 PM IST

చెరువులపై గంగపుత్రుల హక్కులు.. ముదిరాజ్​లకు ఉంటాయంటూ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.ఎల్. మల్లయ్య డిమాండ్ చేశారు. గంగ పుత్రుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మంత్రి మాట్లాడారని ఆ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చర్యలు తీసుకోవాలి

సీఎం ఈనెల 30 లోపు మంత్రి పై చర్యలు తీసుకోవాలని.. లేదంటే గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా.. ముఖ్యమంత్రి చెరువులపై హక్కు గంగపుత్రలకు ఉందని చెప్పినప్పటికీ.. మంత్రి తలసాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు.

'చెరువులపై ముదిరాజ్​లకు హక్కు ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి గంగపుత్ర, ముదిరాజు మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని గంగపుత్ర సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం'.

-ఎ.ఎల్. మల్లయ్య, తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

'గంగపుత్ర, ముదిరాజు మధ్య చిచ్చు పెట్టడం సరికాదు'

ఇదీ చదవండి:చైనా వస్తువులే కాదు టీకా కూడా నాసిరకమే!

Last Updated : Jan 14, 2021, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details