MS Swaminathan Passes Away in Chennai : స్వామినాథన్(MS Swaminathan) మరణంతో.. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కు కోల్పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్.. వినూత్న పద్ధతుల్లో గుణాత్మక దశకు చేర్చారన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే.. అది స్వామినాథన్ కృషితోనే సాధ్యమైందని ముఖ్యమంత్రి కొనియాడారు.
MS Swaminathan Biography : 'దేశం ఓ కుమారుణ్ని కోల్పోయింది'.. ఎంఎస్ స్వామినాథన్‌కు ప్రముఖుల నివాళి
CM KCR Condoles Death of Swaminathan :దేశ ప్రజలకు ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో.. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని కేసీఆర్(CM KCR) పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎంఎస్ స్వామినాథన్‌తో సమావేశం.. వారు చేసిన సూచనలు అమూల్యమైనవన్న సీఎం.. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ కార్యాచరణను ఎంతగానో ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు.
Father of Indian Green Revolution :తెలంగాణ నేలలు అత్యంత సారమంతవైనవని, పాలకులు సరైన దృష్టి సారిస్తే తెలంగాణ దేశానికే విత్త భాంఢాగారంగా విలసిల్లుతుందని చెప్పిన స్వామినాథన్ ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపించిందని కేసీఆర్ చెప్పారు. ఇటీవల వారితో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో.. తెలంగాణ వ్యవసాయాభివృద్ధి తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారని.. వీలు చూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చారని చెప్పారు. ఆ ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెల్లిపోవడం బాధ కలిగిస్తోందని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.