వైద్య వృత్తిలో రాణిస్తూనే... ఓ 63 ఏళ్ల వృద్ధురాలు ఫ్యాషన్ రంగంలో సత్తాచాటుతోంది. హైదరాబాద్కు చెందిన డయాబెటీస్, ఒబేసిటీ వైద్య నిపుణురాలు డాక్టర్ శోభాదేవి... మిసెస్ ఇండియా తెలంగాణ అవార్డును అందుకున్నారు. లండన్లో 20 ఏళ్ల పాటు వైద్యురాలిగా పనిచేసిన ఆమె స్వదేశంలో సేవలందించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఫ్యాషన్ రంగంపై మక్కువ కారణంగా ఇప్పటి వరకు పలు పోటీలలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ 63 ఏళ్ల బామ్మ.. అందాల పోటీ విజేత - Mrs Indian Award for 63 Year Doctor
ఆమె వయసు 63 ఏళ్లు. వైద్య వృత్తిలో రాణిస్తున్నా ఫ్యాషన్ రంగంపై ఉన్న మక్కువ ఆమె వయసుకు అడ్డుచెప్పలేదు. ఈ వయసులో ఫ్యాషన్ పోటీలేంటని నవ్వుకున్నా... ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోటీల్లో పాల్గొని మిసెస్ ఇండియా తెలంగాణ అవార్డును గెలుపొందింది డాక్టర్ శోభాదేవి.
ఈ 63 ఏళ్ల బామ్మ.. అందాల పోటీ విజేత
ఈ ఏడాది మిస్సెస్ ఇండియా తెలంగాణ అవార్డు గెలుచుకోవడం ఆనందంగా ఉందని శోభాదేవి తెలిపారు. ఈ వయసులో ఫ్యాషన్ రంగంలో పోటీలకు వెళ్తే మొదట్లో అందరూ నవ్వుకున్నారని... ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోటీల్లో గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండిః మెస్మరైజ్ చేసిన మిస్ ఫెమినా సుందరి
Last Updated : Nov 8, 2019, 10:46 AM IST