ఎస్సీ అమ్మాయిపై జరిగిన అత్యాచారంపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, రాష్ట్ర ఎరుకల సంఘం డిమాండ్ చేసింది. అమ్మాయిపై అత్యాచారం చేసిన 139 మంది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ట్యాంకు బండ్పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడానికి వెళ్లిన అమ్మాయిని కులం పేరుతో దూషించిన సీఐ నిరంజన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.