ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన విరమించకపోతే... సీఎం కేసీఆర్కు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే... కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నాకు మందకృష్ణ మద్దతు తెలిపారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి విడకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎమ్మార్పీఎస్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మందకృష్ణ భరోసానిచ్చారు.
'ఆర్టీసీని విలీనం చేయకపోతే ప్రగతిభవన్ ఖాళీ కావాల్సిందే' - TSRTC STRIKE UPADATE
హైదరాబాద్లోని జేబీఎస్ వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
MRPS MANDHAKRISHNA MADHIGA SUPPORTS TO TSRTC STRIKE HYDERABAD