ఎస్సీల వర్గీకరణ కొరకు గత 26 సంవత్సరాలుగా వేలాదిమంది త్యాగాలు చేశారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు సురేందర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరారు. హైదరాబాద్ అంబర్పేట్లోని శ్రీ రమణ చౌరస్తాలో గల అంబేడ్కర్ విగ్రహానికి పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని... లేనిపక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర, జిల్లా కమిటీల ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి: దండు సురేందర్ - ఎస్సీల వర్గీకరణ
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని.. లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు సురేందర్ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని... ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని... ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం నడి బొడ్డున సరిత అనే గిరిజన మహిళపై అత్యాచారం జరిపిన దుండగులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని... మహిళా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను కనకరాజు మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయి వెంకటరమణ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలు పెంపు