అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు కూర సురేశ్ మృతిచెందాడు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. అక్కడికి వచ్చిన సురేష్ తండ్రి కృష్ణయ్య మీడియాకు కొన్ని వివరాలు చెప్పారు. తన కుమారుడు భూమి గురించి ఎప్పుడు తిరగలేదని, తన అన్నతోపాటు తానే తహసీల్దార్ కార్యాలయం, కోర్టు చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. ఏడాది క్రితం తొమ్మిది గుంటల భూమి మల్‌రెడ్డి రాంరెడ్డికి అమ్మామని పేర్కొన్నారు. మొత్తం ఏడు ఎకరాల భూమి తమ అన్నదమ్ములదని అన్నారు. తన కుమారుడు... తహసీల్దార్‌ను ఎందుకు చంపాడో ఇప్పటికీ అర్థంకావడం లేదన్నారు. సురేష్ అంత్యక్రియలు ఈ రోజే పూర్తి చేస్తామని వివరించారు.
"నా కొడుకు తహసీల్దార్ ఆఫీసుకు ఎప్పుడూ వెళ్లలేదు" - SURESH FATHER REVEALED LAND ISSUE
తన కుమారుడు తహసీల్దార్ కార్యాలయానికి ఎప్పుడూ వెళ్లలేదని సురేష్ తండ్రి కృష్ణయ్య తెలిపారు. కేసు గురించి తన అన్న దుర్గయ్యతో కలిసి తానే తహసీల్దార్ కార్యాలయం, కోర్టు చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు.
!["నా కొడుకు తహసీల్దార్ ఆఫీసుకు ఎప్పుడూ వెళ్లలేదు"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4991619-thumbnail-3x2-ppp.jpg)
MRO MURDER CASE ACCUSED SURESH FATHER RESPONDED ON LAND ISSUE
"నా కొడుకు తహసీల్దార్ ఆఫీసుకు ఎప్పుడూ వెళ్లలేదు"