తెలంగాణ

telangana

ETV Bharat / state

నిందితుడు లేడు... నిజం తేలేదెలా!?

తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సురేశ్​... మూడు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసు బందోబస్తు నడుమ స్వగ్రామం గౌరెల్లికి తరలించారు. ఈరోజే అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

MRO MURDER CASE ACCUSED SURESH DIED... BUT CASE NOT SOLVED...

By

Published : Nov 7, 2019, 10:09 PM IST

నిందితుడు చనిపోయాడు... మరి నిజాలు తేలేదెప్పుడు?

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ వియజారెడ్డిని సజీవదహనం చేసిన కేసులో తీవ్ర గాయాలపాలైన నిందితుడు మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో మూడురోజులుగా సురేశ్ చికిత్స పొందుతున్నాడు. నిన్నరాత్రి నుంచి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండగా... వెంటిలేటర్​పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

స్వగ్రామానికి సురేశ్ మృతదేహం...

పోలీస్​ బందోబస్తు నడుమ మృతదేహాన్ని గౌరెల్లికి తరలించారు. తన కొడుకు ఎప్పుడూ... తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళలేదని సురేశ్ తండ్రి కృష్ణయ్య తెలిపారు. అసలు ఈ హత్య ఎందుకు చేశాడనేది తమకు అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ మూడు ఎకరాల భూమిలోని 9 గుంటల స్థలాన్ని మల్‌రెడ్డి రాంరెడ్డికి అమ్మినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో నిందితుడు కూడా మృతి చెందటం వల్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంధువులు ఆరోపిస్తున్నట్లు సురేష్​ను ఈ హత్యకు ఎవరైనా ఉసిగొల్పారా... లేక ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడా... అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా మిగిలిన వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్​ మృతి

ABOUT THE AUTHOR

...view details