రాష్ట్రంలో మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హనుమంతరావు, షబ్బీర్ అలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలువడిన తర్వాత వారు చేజారకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.
'చే'జారకుండా కాపాడుకుందాం - 'చే'జారకుండా కాపాడుకుందాం
జూన్ 4న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెలుబడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు పార్టీ ఫిరాయింపులు చేయకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందుకోసం పీసీసీ 25 మంది పర్యవేక్షకులను నియమించింది.
గాంధీభవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ సినీయర్ నేతలు