పార్లమెంటు సమావేశాల్లో 2 అంశాలు లేవనెత్తినట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవే వెంబడి రైల్వే లైను వేయాలని.. సూపర్ ఫాస్ట్, బుల్లెట్ ట్రైన్ వేస్తే ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా ఎంతో లాభదాయక ప్రాజెక్ట్ అని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పీఎస్‌యూలుగా మార్చొద్దని కోరినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. ఆ ఫ్యాక్టరీలకు నిధులిచ్చి ఆధునికీకరించాలని కోరామన్నారు. ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు కొనే వీల్లేకుండా బిల్లులో చేర్చాలన్నామని తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు, వామపక్షాలు రేపు తలపెట్టిన నిరసనకు పూర్తి మద్దతు ఉంటుందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు.