తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఉత్తమ్​ - MP REVANTH REDDY ARREST ISSUE LATEST NEWS

చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇన్ని రోజులు జైళ్లో ఉంచడమే కాకుండా... ఒక ఎంపీని సభకు రానీయకుండా తెరాస అడ్డుకోవడం సరికాదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేస్తామన్నారు.

uttham kumar reddy spekas about revanth reddy arrest issue
'రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది'

By

Published : Mar 18, 2020, 12:16 PM IST

రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు పెట్టి, ఇన్ని రోజులు జైళ్లో ఉంచడమేంటని ప్రశ్నించారు. రేవంత్‌ విషయాన్ని ఇప్పటికే లోస్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ విషయంపై ఈ రోజు మరోసారి స్పీకర్​కు ఫిర్యాదు చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

చిన్న కేసులు, సెక్షన్ల కింద ఎంపీని సభకు రానీయకుండా తెరాస అడ్డుకుంటోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రిని కలిసి తెలంగాణలో పరిస్థితులను గురించి వివరిస్తానని స్పష్టం చేశారు. ఎంపీకే పౌరహక్కులు లేకపోతే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఎంపీ ఉత్తమ్ ప్రశ్నించారు.

ఇవీ చూడండి:అక్కడ చిక్కుకున్న విద్యార్థులను కాపాడండి: కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details